![]() |
![]() |
.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ప్రోమో ఉదయభాను కూడా కనిపించింది. 150th ఎపిసోడ్ ని సెలెబ్రేట్ చేసుకున్నారు. అలాగే కేక్ కూడా కోశారు. ఇక ఈ ప్రోమోలో గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి సర్ అలియాస్ ముఖేష్ గౌడ కూడా కనిపించాడు. ఇక సుహాసిని కూడా వచ్చి జ్యూస్ తాగుతూ "శ్రీముఖి నువ్వు ఎన్ని చెక్కులు తీసుకున్నావో నేను కూడా అన్ని కూడా ఇంచుమించు అన్ని చిక్కులే తీసుకున్నాను" అని చెప్పింది. "అంటే వాళ్ళు చేసి తీసుకున్నారు నువ్వు చెయ్యకుండా తీసుకున్నావు" అంటూ ఇమ్మానుయేల్ సుహాసినికి కౌంటర్ వేసాడు. అలాగే అమూల్య గౌడ, బాలు కలిసి వచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి "గుండె నిండా గుడిగంటలు" సీరియల్ లో నటిస్తున్నారు. ఇద్దరూ కలిసి వచ్చేసరికి శ్రీముఖికి మండిపోయింది. "ఆయనతో పాటు ఎందుకు కలిసొచ్చారో" అని మూతి తిప్పుతూ అడిగింది. దానికి ఇమ్ము "ఒకే కార్ లో వచ్చామ్ నీకు ఆ సంగతి తెలీదనుకుంటా" అనేసరికి శ్రీముఖి షాకైపోయింది.

ఇక శ్రీముఖికి బాలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. ఐతే గుప్పెడంత మనసు హీరో ముఖేష్ వచ్చేసరికి "నీ కళ్ళ ముందు అతనికి బ్రేకప్ చెప్పాలా" అని అడిగింది. "ఇప్పటికిప్పుడే" అని ముఖేష్ అన్నాడు. "బాలు బ్రేకప్" అంటూ శ్రీముఖి సీరియస్ గా చెప్పింది. "ఆల్రెడీ ముఖేష్ తో బ్రేకప్ చేసుకునే వచ్చారు కదా" అన్నాడు బాలు. దానికి శ్రీముఖి ఆమ్మో అంటూ నవ్వేసింది. ఇక తర్వాత బాలు "పది నిమిషాల క్రితం వరకు నాకు శ్రీముఖి అంటే ఇష్టం కానీ ఇప్పుడు బ్రేకప్ చెప్పేసారు" అన్నాడు ఫీలవుతూ. "కంగ్రాట్యులేషన్స్ అని హగ్ చేసుకుని కూడా చెప్పొచ్చు" అంటూ బాలుకి సీరియస్ గా చెప్పింది శ్రీముఖి.
![]() |
![]() |